దసరా పండగ 23న లేదా 24న.? పండితులు ఏమంటున్నారు?
ఈసారి దసరా పండగ ఎప్పుడు అన్నది చాలా మందిలో అనుమానం ఉంది. 23 తేదీనా.. లేక 24వ తేదీ అన్నది క్లారిటీ లేదు. అందుకే..
ఈసారి దసరా పండగ ఎప్పుడు అన్నది చాలా మందిలో అనుమానం ఉంది. 23 తేదీనా.. లేక 24వ తేదీ అన్నది క్లారిటీ లేదు. అందుకే ఎప్పుడు పండగ జరుపుకోవాలన్నది చాలా మందిలో చర్చ జరుగుతోంది. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి నాడు విజయదశమి జరుపుకుంటారు. అయితే పురాణాల ప్రకారం చూస్తే.. దసరా రోజున దుర్గా మాత.. మహిషాసురుడిని వధించిందని ఒక కథనం చెబుతుంది. మరో కథనంలో రావణుడిని చంపి సీతమ్మను రాక్షసుల చెర నుంచి విడిపించి రాములవారు అయోధ్యకు తిరిగివస్తారు. దీనికి ప్రతీకగా ఉత్తరాదిన విజయదశమి నాడు రావణ, కుంభకర్ణ, ఇంద్రజిత్తుల దిష్టిబొమ్మలను దహనం చేస్తారన్నది పురాణాల్లో ఉంది. పంచాంగం ప్రకారం అశ్వయుజ శుక్ల పక్ష దశమి తిథి సోమవారం, అక్టోబర్ 23వ తేదీ సాయంత్రం 5.44 గంటలకు ప్రారంభమవుతుంది. మంగళవారం, అక్టోబర్ 24 మధ్యాహ్నం 03:14 గంటలకు ముగుస్తుంది. రెండు రోజులు దశమి తిథి ఉండడంతో విజయదశమి పండగపై సందిగ్ధత నెలకొంది.
కొందరు పండితులు 24వ తేదీన విజయదశమి జరుపుకోవాలని చెబుతుంటే.. మరి కొందరేమో 23వ తేదీనే జరుపుకోవాలని అంటున్నారు. అయితే ఈ నెల 23నే విజయదశమి జరుపుకోవాలంటూ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన శృంగేరి పీఠం సూచింది. ఇక తెలంగాణ విద్వత్ సభ కూడా ఈ నెల 23న దసరా పండుగను నిర్వహించుకోవాలని సూచించింది.