ఉత్తరాఖండ్, ఢిల్లీలో 4.5 తీవ్రతతో భూకంపం
భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైందని.. తెహ్రీకి 78 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని..
ఉత్తరాఖండ్, ఢిల్లీ ప్రాంతాల్లో ఆదివారం ఉదయం స్వల్ప భూకంపం వచ్చింది. ఉదయం 8.33 గంటల సమయంలో తెహ్రీలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైందని.. తెహ్రీకి 78 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చాయని తెలిపింది.
ఒక్కసారిగా భూమి కంపించడంతో.. ప్రజలకు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలో నుండి పరుగులు తీశారు. కాగా.. భూకంపం వల్ల ఎంత నష్టం జరిగిందన్న విషయం తెలియాల్సి ఉంది. కాగా.. గత నెలలో ఉత్తరాఖండ్‌లో రెండుసార్లు భూకంపం వచ్చింది. అక్టోబర్ 8న 3.9 తీవ్రతతో మున్సియారీలో భూమి కంపించింది. అక్టోబర్ 2న 2.5 తీవ్రతతో ఉత్తరకాశీలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.