632కు చేరిన మృతుల సంఖ్య..!

632కు చేరిన మృతుల సంఖ్య మొరాకోలో జరిగిన తీవ్ర భూకంపం ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది

Update: 2023-09-09 11:11 GMT

మొరాకోలో తీవ్ర భూకంపం

632కు చేరిన మృతుల సంఖ్య

మొరాకోలో జరిగిన తీవ్ర భూకంపం ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. సుదూరంగా ఉండే పర్వతప్రాంతాల్లో ఇప్పటివరకు 632 మంది చనిపోయారని, మరో 329 మంది గాయపడ్డారని మొరాకో ప్రభుత్వం చెబుతోంది. మృతులు, గాయపడినవారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తున్నాయి. మర్రకేష్ కు నైరుతి దిశలో 71 కిలోమీటర్ల దూరంలో 18.5 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రతను 6.8 గా గుర్తించారు. అల్ హౌయిజ్ మర్రకేష్, ఔర్జజేట్ , అజిలాల్ ,చిచౌవా,టారోడంట్ మున్సిపాలిటీల్లో ఎక్కువగా మరణించారని, ఇప్పటివరకు 153 మందిని ఆసుపత్రుల్లో చేర్చామని ఆదేశ ఆంతరంగిక వ్యవహారాల శాఖ మంత్రి తెలిపారు. మొరాకోలో సంభవించిన తీవ్ర భూకంపానికి పోర్చుగల్, అల్జీరియా, స్పెయిన్ లలో భూమి కంపించిందన్నారు. ప్రజలంతా వీధుల్లోకి పరుగులు తీశారు. అయితే ఎటువంటి ఆస్తి,ప్రాణనష్టం జరగలేదన్నారు. మొరాకోలోని భారతీయుల కోసం భారతీయ రాయబార కార్యాయం లోని +212661297491 హెల్ప్ లైన్ ను సంప్రదించాలన్నారు. మొరాకోలోని చారిత్రక కట్టడాలన్నీ నేలకూలాయి. క్షేమంగా ఉన్నవారంతా కనిపించనివారి కోసం వెతుకుతున్నారు. శిధిలాల కింద చిక్కుకున్న వారి కోసం అక్కడి ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. సహాయ కార్యక్రమాలు, ఆపన్న హస్తం చాచడానికి భారత ప్రభుత్వం అంగీకరించింది.

Tags:    

Similar News