ప్రారంభమైన కౌంటింగ్
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ల =లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. 182 నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలట్ లను లెక్కించనున్నారు
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ల లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. 182 నియోజకవర్గాల్లో తొలుత పోస్టల్ బ్యాలట్ లను లెక్కించనున్నారు. గుజరాత్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎనిమిదో సారి అధికారంలోకి రావాలని అది శ్రమించింది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమత్రి అమిత్ షాలతో పాటు కేంద్ర మంత్రులు ప్రచారాన్ని నిర్వహించారు. గుజరాత్ ఎన్నికల్లో మరోసారి గెలవడానికి బీజేపీ శాయశక్తులా కృషి చేసింది.
ఎవరికి వారిదే ధీమా...
అలాగే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా పోటీ పడ్డాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి గుజరాత్ తమదేనంటూ సవాల్ విసురుతుంది. పోలింగ్ శాతం తక్కువగా ఉండటం ఎవరికి నష్టం అన్న దానిపై చర్చలు జరిగాయి. ఎటూ బీజేపీ ప్రభుత్వం గెలుస్తుందన్న భావనతో ప్రజలు ఓటింగ్ కు దూరంగా ఉన్నారన్న భావన లేకపోలేదు. అలాగే నిశ్శబ్దవిప్లవంలా తమ గెలుపు ఖాయమని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతుంది. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఉండటంతో ప్రచారానికి కేవలం ఒక రోజు మాత్రమే వెళ్లారు. అధికార పార్టీ పై వ్యతిరేకత తమకు అధికారాన్ని తెచ్చిపెడుతుందన్న ఆశతో ఆ పార్టీ నేతలున్నారు. ఈరోజు ఎవరి భవిష్యత్ ఏంటో తేలనుంది.