నేడు రాష్ట్రపతి ఎన్నిక

భారత్ లో అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవికి ఈరోజు ఎన్నిక జరగనుంది.;

Update: 2022-07-18 02:20 GMT

భారత్ లో అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవికి ఈరోజు ఎన్నిక జరగనుంది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు రాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. పోలింగ్ సామాగ్రిని ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు తరలించిన ఎన్నికల సంఘం ముందుగా ఓటింగ్ పై వారికి అవగాహన కల్పించింది. ఉదయం పది గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది.

రెండు రంగులతో బ్యాలెట్ పేపర్లు..
ఈ ఎన్నికల్లో మొత్తం 4,800 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆకుపచ్చ బ్యాలెట్ పేపర్ పై ఎంపీలు, గులాబీరంగు బ్యాలట్ పేపర్ పై ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు. ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేయనున్నారు. ఈ నెల 21వ తేదీన రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల వెలువడనున్నాయి. ఎన్నికైన వ్యక్తి ఈ నెల 25వ తేదీన భారత రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.


Tags:    

Similar News