Delhi Liqour Scam : కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు

మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది

Update: 2023-10-31 01:47 GMT

arvind kejriwal

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల రెండోతేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు కోరారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు.

వచ్చే నెల 2న...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే అనేక మంది అరెస్టయిన సంగతి తెలిసిందే. మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి జైలులో ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ విచారణకు నోటీసులు ఇవ్వడం, ఆయన హాజరుకావడం ఇదే తొలిసారి. సామాన్యుల పార్టీగా, అవినీతికి వ్యతిరేకంగా పెట్టిన పార్టీ అధినేతగా అరవింద్ కేజ్రీవాల్ ఇటువంటి ఆరోపణలను ఎదుర్కొనడం కొంత ఇబ్బందికరమే అయినా.. కక్ష సాధింపు చర్యలా? కాదా? అన్నది న్యాయస్థానాల్లోనే తేలనుంది.


Tags:    

Similar News