Big Breaking : కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారులు.. ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు చేరుకున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. కేజ్రీవాల్ ఇంటికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు చేరుకున్నారు. ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పిన తర్వాత ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసానికి రావడంతో ఆయనను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఆయన ఇంటి వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కూడా భారీగా చేరుకున్నారు. పోలీసులు కూడా ఆయన ఇంటి వద్ద మొహరించారు. ఏ క్షణమైనా ఆయనను అరెస్ట్ చేసే అవకాశముందని అంటున్నారు.
హైకోర్టు తీర్పుతో...
అరవింద్ కేజ్రీవాల్ తనను ఈడీ అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఇవాళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. చారణ పేరుతో తనను పిలిచి అరెస్ట్ చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టేరేట్ అధికారులు చూస్తున్నారని ఆయన తన పిటీషన్ లో పేర్కొన్నారు. ఈడీ అరెస్ట్ నుంచి తాము మినహాయింపు ఇవ్వలేమని హైకోర్టు పేర్కొంది. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టేరేట్ అధికారులు కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని సోదాలు జరుపుతున్నారు.