Uttarakhand పదిహేడు రోజులు సొరంగంలో ఎలా గడిపామంటే?

ఉత్తరాఖండ్‌లో సొరంగంలో చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు

Update: 2023-11-29 02:34 GMT

ఉత్తరాఖండ్‌లో సొరంగంలో చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ర్యాట్ మైనింగ్ ద్వారా వారిని సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. పదహేడు రోజులు కార్మికులు సొరంగంలో ఎలా గడిపారన్న దానిపై అందరికీ ఉత్కంఠ సహజంగానే ఉంటుంది. ప్రాణాలు దక్కుతాయా? మనల్ని ఎవరైనా రక్షిస్తారా? అన్న అనుమానంతో వారు సొరంగంలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారా? లేక ధైర్యం కూడదీసుకుని వాళ్లు ఒకరినొకరు పలుకరించుకుంటూ ఏమీ కాలేదన్న భరోసా ఇచ్చుకుంటూ గడిపారా? అన్నది అందిరి మదిలో నెలకొన్న సందేహాలే.

అన్ని ప్రయత్నాలు...
17 రోజులుగా ఒక సొరంగంలో చిక్కుకుని ఉండటం అంటే సామాన్యమైన విషయం కాదు. ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమవుతూనే ఉన్నాయి. ఆ విష‍యం వారికి తెలుసు. కానీ వారు ఎలాగైనా తమను రక్షిస్తారన్న నమ్మకం. ప్రభుత్వం తమను కాపాడుతుందన్న విశ్వాసమే వారిని బతికించింది. చివరకు పెద్ద పెద్ద యంత్రాలు కార్మికులను తీసుకు వచ్చేందుకు సహకరించకపోయినా ర్యాట్ మైనింగ్ మాత్రం సక్సెస్ ఫుల్ గా 41 మంది కూలీలకు ప్రాణ బిక్ష పెట్టింది. దీంతో నిన్న రాత్రి వారు సురక్షితంగా బయటకు రాగలిగారు.
మానసికోల్లాసానికి...
అయితే తాము సొరంగంలో ఉన్నామన్న విషయాన్ని మరిచిపోవడానికి జాగాడ్ తో ఆటలు ఆడేవారమని బయటకు వచ్చిన కార్మికులు తెలిపారు. అలాగే యోగా, వాకింగ్ వంటివి చేయడం వల్ల శరీరానికి, మనసుకు కొంత ఊరటకల్గించేందుకు దోహదపడ్డాయని కార్మికులు తెలిపారు. రిలీఫ్ టీం ద్వారా అందే సామాగ్రి తమలో మరింత ఉత్సాహాన్ని నింపిందన్నారు. క్రికెట్ ఆడుతూ, సినిమాలు కూడా చూసేవారమని చెప్పారు. సొరంగం వద్దకు ర్యాట్ మైనర్లు చేరుకున్న వెంటనే వారిని ఆనందంగా ఆలింగనం చేసుకుని తాము ఇక బయటపడ్డట్టేనని అనుకున్నామని వారు చెప్పుకొచ్చారు.


Tags:    

Similar News