Exit Polls : ఎన్డీఏకే అవకాశాలు... మళ్లీ మోదీ ప్రధాని కావడం ఖాయమట

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎన్డీయేకు అనుకూలంగా వచ్చాయి. మూడోసారి ప్రధానిగా మోదీ అవుతున్నారని తేల్చి చెప్పాయి

Update: 2024-06-02 03:59 GMT

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎన్డీయేకు అనుకూలంగా వచ్చాయి. మూడోసారి ప్రధానిగా మోదీ అవుతున్నారని తేల్చి చెప్పాయి. సాధారణంగా కొన్ని సంస్థలు ఇచ్చే ఎగ్జిట్ పోల్స్ కు కొంత క్రెడిబిలిటీ ఉంది. ఏ రాజకీయ పార్టీకి చెందిన సంస్థలు కాకపోవడంతో పాటు ఖచ్చితమైన ఫలితాలను ప్రజలకు అసలు ఫలితాలను రాకముందే ఇచ్చి తమ సంస్థ పేరు ప్రతిష్టలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉపయోగించుకునేందుకు ఈ ఎగ్జిట్ పోల్స్ ఉపయోగపడతాయి. అందుకే అందరూ కొన్ని సంస్థలు ఇచ్చే ఎగ్జిట్ ఫలితాలు రాబోయే ఎన్నికల ఫలితాలకు దగ్గరగా ఉంటాయని అంచనా వేసుకోవడానికి వీలవుతుంది. అందులో ముఖ్యమైన మరో జాతీయ మీడియా సంస్థ ఏంటంటే మై యాక్సిస్ - ఇండియా టుడే సంస్థ 2019 ఎన్నికల సందర్భంగా ఎగ్జిట్ పోల్స్ లో ఏం చెప్పిందంటే? 2019 ఎన్నికల్లో ఇండియా టుడే - మై యాక్సిస్ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి 130 నుంచి 135 స్థానాలు వస్తాయని చెప్పింది. టీడీపీకి 37 నుంచి నలభై స్థానాలు దక్కే అవకాశముందని తెలిపింది. అయితే 151 స్థానాలు వైసీపీకి, 23 స్థానాలు టీడీపీకి దక్కాయి.

ఈసారి మాత్రం...
ఈసారి కూడా ఈ సంస్థ చెప్పే అంచనాలు నిజమయ్యే అవకాశముందని ప్రజలు కూడా ఒక అంచనాకు వస్తున్నారు. దేశంలో ఎన్డీఏ కూటమికి 361 నుంచి 401 స్థానాలు వస్తాయని చెప్పగా, విపక్ష కూటమి అయిన ఇండియా కూటమికి131 నుంచి 166 స్థానాలు వస్తాయని తెలిపింది. ఇతరులకు ఎనిమిది నుంచి ఇరవై స్థానాలు వస్తాయని తెలిపిదంి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలలో వాస్తవం ఎంత? అని పక్కన పెడితే కొంతలో కొంత ఈ సంస్థ ఇచ్చే ఎగ్జిట్ పోల్స్ పై కొంత నమ్మకం ఏర్పడింది. అందుకే ఈరోజు కోసం రాజకీయ పార్టీల నుంచి ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ఉద్యోగులు అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి లాభం అనేది ఈ సంస్థ తన ఎగ్జిల్ పోల్స్ లో వివరించగలిగింది. పోలింగ్ జరిగిన రోజు ఓటర్ల మనోభావాలను తీసుకుని మరీ శాస్త్రీయంగా అంచనాలు వేసి మరీ ప్రజల ముందు ఉంచింది. మరి చివరకు ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేకపోయినా కొంత జనం మూడ్ అనేది తెలిసిందనే అనుకోవాలి.


Tags:    

Similar News