Shocking: నకిలీ డాక్టర్ల గుట్టురట్టు.. పోలీసుల విచారణలో దిమ్మదిరిగే నిజాలు
దేశంలో దేవుడి తరవాత మరో దేవుడిగా భావించేది అది డాక్టర్లు మాత్రమే. మరణించే వ్యక్తికి ప్రాణం పోసేది ఒక్క డాక్టర్‌కు..
దేశంలో దేవుడి తరవాత మరో దేవుడిగా భావించేది అది డాక్టర్లు మాత్రమే. మరణించే వ్యక్తికి ప్రాణం పోసేది ఒక్క డాక్టర్‌కు మాత్రమే ఉంటుంది. ఎంతటి వ్యాధి అయినా నయం చేసే డాక్టర్‌కు ఆ సమయంలో డాక్టర్లే దేవుళ్లుగా భావిస్తున్నారు బాధితులు. కానీ కొందరు అత్యశకు కక్కుర్తి పడే అడ్డదారులు తొక్కి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొందరు ఎలాంటి అర్హతలు లేకున్నా డాక్టర్లమంటూ చెప్పుకొంటూ రోగుల ప్రాణాలను తీస్తున్నారు. ఇక అసలు స్టోరీలోకి వెళ్తే.. దేశ రాజధాని ఢిల్లీలో నకిలీ డాక్టర్ల ముఠా గుట్టు రట్టయింది. దీనిని చూసిన పోలీసులే షాక్ అయ్యారు. నకిలీ సర్టిఫికెట్లతో సర్జరీలు చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని విలాసవంతమైన గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో షాకింగ్ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు సైతం బిత్తరపోయారు. అయితే ఈ నకిలీ సర్టిఫికేట్లతో సర్జరీలు చేస్తున్న వైద్యుల రాకెట్ ఈనెల 15న బట్టబయలు చేశారు ఢిల్లీ పోలీసులు. అయితే పోలీసుల విచారణలో అసలు నిజాలు బయట పడగా, ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు. అయితే ఈ నకిలీ సర్టిఫికేట్లు ఉన్న వైద్యులు రోగుల నుంచి భారీగా డబ్బులు దండుకునేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.
పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు..
ఈ నకిలీ సర్టిఫికేట్లతో పట్టుబడ్డ నకిలీ డాక్టర్ల గుట్టు రట్టు కావడంతో పోలీసులు లోతుగా విచారణ జరిపారు. వారి విచారణలో పోలీసులు సైతం దిమ్మదిరిగే విషయాలు వెలుగులోకి రావడం ఇప్పుడు దేశంలో సంచలనంగా మారింది. ఈ రాకెట్‌లో అగర్వాల్ మెడికల్ సెంటర్‌ను నడుపుతున్న డాక్టర్ నీరజ్ అగర్వాల్, ఆయన భార్య పూజ అగర్వాల్, మరో డాక్టర్ జస్‌ప్రీత్ సింగ్‌తోపాటు మాజీ ల్యాబ్ టెక్నీషియన్ మహేందర్ సింగ్‌లను అరెస్టు చేసినట్టు ఢిల్లీ పోలీసులు మీడియాకు వెళ్లడించారు.
అగర్వాల్ మెడికల్ సెంటర్‌ను నడుపుతున్న డాక్టర్ అగర్వాల్, మరో ముగ్గురు వైద్య ప్రోటోకాల్‌లను పాటించకుండా రోగుల కీలక అవయవాలపై శస్త్రచికిత్సలు చేశారని రోగుల కుటుంబాలు ఆరోపించాయి. ఫిర్యాదుదారుల ప్రకారం, డాక్టర్ అగర్వాల్ ఒక వైద్యుడు, అయితే అతను నకిలీ పత్రాలను సృష్టించి అనేక రకాల శస్త్రచికిత్సలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అగర్వాల్ మెడికల్ సెంటర్‌పై ఫిర్యాదులు
2016 నుంచి డాక్టర్ అగర్వాల్, పూజ, అగర్వాల్ మెడికల్ సెంటర్‌పై కనీసం తొమ్మిది ఫిర్యాదులు వచ్చాయని కేసు దర్యాప్తులో తేలింది. పోలీసుల ప్రకారం, మొత్తం ఏడు కేసులలో, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగులు మరణించారు. వార్తా సంస్థ PTI నివేదించింది. 2022లో అస్గర్ అలీ అనే వ్యక్తి గాల్‌బ్లాడర్ చికిత్స కోసం ఈ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. డాక్టర్ జస్‌ప్రీత్ ఆయనకు శస్త్రచికిత్స చేస్తారని చెప్పి.. తీరా ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లిన తర్వాత పూజ అగర్వాల్, మహేందర్ కలిసి ఆపరేషన్ నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం అలీకి విపరీతమైన నొప్పి రావడంతో వెంటనే అతన్ని దగ్గరలోని సప్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన మృతి చెందినట్టు అక్కడి వైద్యులు నిర్ధారించారు.
అలీ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. అగర్వాల్ ఒక ఫిజీషియన్ అని.. కానీ, ఆయన నకిలీ సర్టిఫికెట్లతో సర్జరీలు కూడా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. లోతైన విచారణ చేపట్టగా.. 2016 నుంచి అగర్వాల్ మెడికల్ సెంటర్‌పై 9 ఫిర్యాదులు వచ్చాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. వాటిలో ఏడు కేసుల్లో వై ద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగులు మృతి చెందినట్టు పోలీసులు చెప్పారు.
దర్యాప్తులో అగర్వాల్ పనితనం బట్టబయలు:
నవంబర్ 1 న నలుగురు వైద్యులతో కూడిన మెడికల్ బోర్డును వైద్య కేంద్రాన్ని పరిశీలించడానికి పిలిచారు. ఇందులో చాలా లోపాలను గుర్తించినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) చందన్ చౌదరి వెల్లడించారు. దర్యాప్తులో అగర్వాల్ పనితనం బట్టబయలైంది. రోగుల చికిత్స, శస్త్రచికిత్సకు సంబంధించిన తప్పుడు పత్రాలు సృష్టించినట్లు గుర్తించారు పోలీసులు.
వైద్యులు సంతకాలు మాత్రమే ఉన్న 414 ప్రిస్క్రిప్షన్ స్లిప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పైభాగంలో ఖాళీగా ఉన్న స్థలం, క్లినిక్‌లో నిర్వహించబడే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP) ప్రక్రియల కోసం రోగి వివరాలను కలిగి ఉన్న రెండు రిజిస్టర్లు, అనేక నిషేధిత మందులు, ఇంజెక్షన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గడువు ముగిసిన సర్జికల్ బ్లేడ్‌లు స్వాధీనం
అగర్వాల్ నివాసం, క్లినిక్ నుంచి గడువు ముగిసిన సర్జికల్ బ్లేడ్‌లు, అనేక మంది రోగులకు చెందిన ఒరిజినల్ ప్రిస్క్రిప్షన్ స్లిప్‌లు, 47 వేర్వేరు బ్యాంకుల నుంచి చెక్‌బుక్‌లు, వివిధ బ్యాంకుల నుంచి 54 ATM కార్డులు, పోస్టాఫీసుల నుండి పాస్‌బుక్‌లు, ఆరు POS టెర్మినల్ క్రెడిట్ కార్డ్ మెషీన్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.