Elephant Fight In Kerala : ఏనుగుల మధ్య బిగ్ ఫైట్.. భయాందోళనలో పరుగులుతీసిన భక్తులు
కేరళలో ఏనుగులు మధ్య యుద్ధంతో భక్తులు భయంతో పరుగులు తీశారు
కేరళలో ఏనుగులు మధ్య యుద్ధంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. కేరళలోని త్రిసూర్ జిల్లాలోని అరట్టుపుజ ఆలయంలో నిన్న రాత్రి ఆరాజ్ ఆచార ఊరేగింపును నిర్వహించారు. ఇందులో ఉత్సవ విగ్రహాలను రెండు ఏనుగులపై ఉంచి ఊరేగించారు. ఆలయం బయట ఈ ఉత్సవాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. అయితే రెండు ఏనుగులు ఒకదానిపై ఒకటి తలపడ్డాయి. భీకరంగా పోరాటానికి దిగాయి. తనపై కూర్చున్న మావటి వాడిని కూడా కిందకు తోసి ఫైటింగ్ కుదిగాయి.
గురవాయూర్‌కు చెందిన...
ఈ ఉత్సవాల్లో గురవాయూర్ కు చెందిన ఏనుగు రవికృష్ణన్ తొలుత అవతలి ఏనుగుపై దాడికి దిగింది. మావటిని కిందకు తోసేసి తోటి ఏనుగుపై కలపడటంతో భక్తులు భయాందోళనలతో పరుగులు తీశారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. మావటి వాళ్లు ఎంత కంట్రోల్ చేసినా ఏనుగులు మాత్రం ఆగలేదు. చివరకు ఎలిఫెంట్ స్క్కాడ్ అక్కడకు చేరుకుని ఎట్టకేలకు వాటిని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఏనుగుల కొట్లాటను వీడియో తీసి సామాజికమాధ్యమంలో కొందరు పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది.