భర్తలకు భారీ షాకిచ్చిన ఐదుగురు వివాహితలు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రప్రభుత్వం భూమి ఉన్న పేదలకు ఇళ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం ..
ఐదుగురు వివాహితలు తమ భర్తలకు ఊహించని షాకిచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుండి నగదు రూపంలో అందే సాయం వచ్చీరాగానే ఐదుగురు వివాహితలు తమ ప్రియుళ్లతో జంప్ అయ్యారు. ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకీ జిల్లాల్లో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగుచూసింది. ఆ భార్యలు చేసిన పని స్థానికంగా సంచలనం రేపింది. అకౌంట్లలో పడిన డబ్బులతో ప్రియుళ్లతో భార్యలు వెళ్లిపోయారని తెలిసి.. భర్తలు లబోదిబోమంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రప్రభుత్వం భూమి ఉన్న పేదలకు ఇళ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పదకం కింద బారాబంకీ జిల్లా నుండి 40 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు. తొలివిడతగా వారి అకౌంట్లలో రూ.50 వేలు జమ చేశారు. అలా డబ్బు అకౌంట్లలో పడగానే వివాహితలు తమ భర్తలను వదిలేసి ప్రియుళ్లతో పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న భర్తలు.. వారికి రెండో విడత సాయంగా నగదు వేయొద్దంటూ అధికారులను వేడుకున్నారు.