విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఎందుకంటే
నూట ఎనభై మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో అర్జంటుగా ల్యాండింగ్ చేశారు.
నూట ఎనభై మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో అర్జంటుగా ల్యాండింగ్ చేశారు. విమానం అద్దాలకు పగుళ్లు రావడంతో వెంటనే విమానాన్ని ల్యాండ్ చేశారు. ఈ సమయంలో 180 మంది ప్రయాణికులు ఉణ్నారు. పూనే నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం విండ్ షీల్డ్‌పై చిన్న పగుళ్లు ఏర్పడటంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. షెడ్యూల్ కంటే ముందుగానే ల్యాండ్ చేశారు.
పగుళ్లు ఉండటంతో...
విండ్ షీల్డ్‌కు పగుళ్లు ఉండటాన్ని గుర్తించిన పైలట్లు వెంటనే ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. ఎయిర్ పోర్టు అధికారులు వెంటనే అనుమతి ఇవ్వడంతో సేఫ్ గా ల్యాండ్ అయింది. ప్రయాణికులంతా క్షేమమని ఎయిర్ ఇండియా తర్వాత ప్రకటన విడుదల చేసింది. ఇలా పగుళ్లు రావడం సర్వసాధారణమేనని, అయితే పరిశీలంచకుండా టేకాఫ్ చేయడంపై దర్యాప్తు ప్రారంభమైంది.