Delhi : పదిహేడు విమానాలు రద్దు.. పైకి ఎగరలేక
ఢిల్లీలో పొగమంచు వాహనదారులను ఇబ్బంది పెడుతుంది. వాహనాలను మాత్రమే కాదు విమానాలు కూగా పైకి ఎగరడం లేదు
ఢిల్లీలో పొగమంచు వాహనదారులను ఇబ్బంది పెడుతుంది. వాహనాలను మాత్రమే కాదు విమానాలు కూగా పైకి ఎగరడం లేదు. కొన్ని విమానాలను అధికారులు రద్దు చేశారు. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు పదమూడు గంటల పాటు ఆలస్యవుతున్నట్లు ప్రకటనలు వస్తుండటంతో ప్రయాణికులు నిరాశలో ఉన్నారు. దట్టమైన పొగమంచు ఢిల్లీలో వ్యాపించడంతో అనేక విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పొగమంచుతో పాటు చల్లని గాలులు కూడా వీస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
రైళ్ల రాకపోకల్లో ఆలస్యం...
పొగమంచు కారణంగా రహదారులపై వాహనాలు కన్పించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశముంది. హెడ్ లైట్స్ వేసుకుని వస్తున్నా ప్రయోజనం లేదు. మార్నింగ్ వాక్ చేసే వాళ్లు కూడా పొగమంచును చూసి బయటకు రావడానికి భయపడుతున్నారు. విమానాలతో పాటు రైళ్ల రాకపోకలు కూడా ఆలస్యంగా మారాయి. అనేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరాల్సిన పదిహేడు విమానాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.