Loksaha Speaker : హిస్టరీలో ఫస్ట్ టైం.. ఎన్నిక జరిగితే ఏం జరుగుతుందో?
భారత దేశ చరిత్రలో తొలిసారి లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది
భారత దేశ చరిత్రలో తొలిసారి లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అధికార, ప్రతిపక్ష మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో స్పీకర్ ఎన్నిక అనివార్యమయింది. ఎన్డీఏ తరుపున ఓం ిబిర్లా, ఇండియా కూటమి తరుపున సురేష్ లు నామినేషన్ లు స్పీకర్ పోస్టుకు దాఖలు చేశారు. దాదాపు 78 ఏళ్ల తర్వాత స్పీకర్ ఎన్నిక జరగబోతుంది. ఎప్పుడూ అధికార పక్షం ఎంపిక చేసిన వ్యక్తిని స్పీకర్ గా ఎన్నుకునే సంప్రదాయానికి ఈ లోక్‌సభ లో తెరపడింది. సంప్రదాయం ప్రకారం స్పీకర్ పదవి అధికార పక్షం తీసుకుంటే, డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకు ఇవ్వాల్సి ఉంటుంది. డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు ఎన్డీఏ కూటమి అంగీకరించకపోవడంతో లోక్‌సభ స్పీకర్ఎన్నిక అనివార్యంగా మారింది.
1946లో తొలిసారి...
1946లో లోక్‌సభ స్పీకర్ కు జరిగిన ఎన్నికలో జి.వి.మౌలాంకర్ స్పీకర్ గా ఎన్నికయ్యారు. తర్వాత 1956లో లోక్‌సభ, రాజ్యసభలు ఏర్పాటయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతూ వస్తుంది.కానీ ఈసారి ఎన్డీఏ తో దాదాపు సరిసమానంగా ఇండియా కూటమి సంఖ్యాబలం ఉండటంతో రెండు కూటమిల నుంచి అభ్యర్థులుగా స్పీకర్ పదవికి నామినేషన్ వేశారు. దీంతో రేపు స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశముంది. అయితే ఎన్డీఏ కూటమి నాయకత్వం దిగి వచ్చి డిప్యూటీ స్పీకర్ పదవి ఇండియా కూటమికి అప్పగిస్తే స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. లేకుంటే ఎన్నిక జరిగితే అన్ని పార్టీలు తమ ఎంపీలకు విప్ ను జారీ చేసే అవకాశముంది.