మాజీ సీఎంకు తప్పిన ప్రమాదం
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.;
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బెంగళూరు నుంచి కలుబుర్గికి హెలికాప్టర్ తో వెళుతుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్ చాకచక్యంగా హెలికాప్టర్ ను జెవారీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో యడ్యూరప్పకు పెద్ద ప్రమాదం తప్పింది. బీజేపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.
హెలికాప్టర్ లో సాంకేతిక లోపం...
కలుబుర్గిలో ఈ నెల 12న ప్రధాని మోదీ పర్యటన ఉంది. ఆ పర్యటన ఏర్పాట్లను పరిశీలించడానికి యడ్యూరప్ప వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని గుర్తించిన వెంటనే పైలట్ ల్యాండింగ్ చేయడంతో సేఫ్ గా ఆయన ప్రాణాలతో బయటపడ్డారని బీజేపీ నేతలు చెబుతున్నారు.