నితీష్ పై ప్రశాంత్ కిషోర్ హాట్ కామెంట్స్...మోదీ కాళ్లను తాకారంటూ?

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హాట్ కామెంట్స్ చేశారు

Update: 2024-06-15 07:44 GMT

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హాట్ కామెంట్స్ చేశారు. బీహార్ సీఎం పదవిలో కొనసాగేందుకు ప్రధాని మోడీ కాళ్లను నితీష్ కుమార్ తాకారని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ‘జన్ సురాజ్’ కార్యక్రమంలో భాగంగా భాగల్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.

బీహార్ ప్రయోజనాలను...
మోడీ కాళ్లను తాకి బీహార్‌కు నితీష్ కుమార్ తీరని అవమానం తెచ్చారని అన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి జేడీయూ అవసరం ఉందని, దానిని రాష్ట్రం కోసం నితీష్ వినియోగించడం లేదన్నారు. రాష్ట్రం కోసం వినియోగించాల్సిన అవకాశాన్ని నితీష్ కుమార్ తన స్వప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారని తెలిపారు.


Tags:    

Similar News