Breaking : మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య మృతి

మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పాందుతూ ఆయన మృతి చెందారు.

Update: 2024-08-08 05:35 GMT

మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పాందుతూ ఆయన మృతి చెందారు. బుద్ధదేవ్ భట్టాచార్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2000 నుంచి 2011 వరకూ బుద్ధదేవ్ భట్టాచార్య పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. కమ్యునిస్టు సిద్ధాంతాలను పుణికిపుచ్చుకున్న బుద్ధదేవ్ భట్టాచార్య పాలనలో కూడా ఆ మార్క్ ను చూపించారు.

బెంగాల్ ముఖ్యమంత్రిగా...
1946 మార్చి 1న కోల్‌కత్తాలో బుద్ధదేవ్ భట్టాచార్య జన్మించారు. 1997లో బుద్ధదేవ్ భట్టాచార్య తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం రాజకీయంగా ఆయన వెనుదిరగి చూసుకోలేదు. ముఖ్యమంత్రిగా పలువురు ప్రశంసలను అందుకున్నారు. బుద్ధదేవ్ భట్టాచార్య మృతిపట్ల పలువురు నేతలు సంతాపాన్ని ప్రకటించారు.


Tags:    

Similar News