అసదుద్దీన్ కు షాక్.. ఎంఐఎం ను వీడిన నలుగురు ఎమ్మెల్యేలు
2020లో బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మజ్లిస్ ఏకంగా 5 సీట్లను గెలుచుకుంది. ఆ ఐదురుగు మజ్లిస్ ఎమ్మెల్యేల్లో
బీహార్‌లోని ప్రతిపక్ష RJDలోకి నలుగురు AIMIM ఎమ్మెల్యేలు చేరిపోయారు. బుధవారం నాడు AIMIM పార్టీలోని ఐదుగురు ఎమ్మెల్యేలలో ఒకరు తప్ప మిగిలిన వారంతా.. ఎంఐఎంను వీడారు. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో మినహాయించి అందరూ ఎంఐఎంకు దూరం అవ్వడంతో బీహార్ రాష్ట్రంలో ఏకైక అతిపెద్ద పార్టీగా RJD తన హోదాను తిరిగి పొందింది. ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ నలుగురు ఎంఐఎం శాసనసభ్యులను రాష్ట్ర అసెంబ్లీకి తీసుకువచ్చారు. స్వయంగా కారు నడుపుతూ అసదుద్దీన్ ఒవైసీ పార్టీ నుండి వైదొలిగి RJDలో విలీనం చేయాలనే వారి అధికారిక నిర్ణయం గురించి తెలియజేయడానికి స్పీకర్ విజయ్ కుమార్ సిన్హాను కలిశారు.
2020లో బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మజ్లిస్ ఏకంగా 5 సీట్లను గెలుచుకుంది. ఆ ఐదురుగు మజ్లిస్ ఎమ్మెల్యేల్లో నలుగురు ఆర్జేడీలో చేరిపోయారు. ఈ మేరకు మజ్లిస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బుధవారం ఆర్జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్ సమక్షంలో ఆర్జేడీలో చేరారు. మజ్లిస్‌ను వదిలి ఆర్జేడీలో చేరిన వారిలో ముహ్మద్ ఇజార్ అస్ఫీ (కొచ్చాడామమ్), షహనాజ్ అలం (జోకిహర్), సయ్యద్ రక్నుద్దీన్ (బైసీ), అజార్ నయీమీ (బహదుర్గుని)లు ఉన్నారు. ఇక మజ్లిస్‌లో అమౌర్ నుంచి విజయం సాధించిన అఖ్తరుల్ ఇమాన్ ఒక్కరు మాత్రమే ఎంఐఎంలో మిగిలారు.
ఉదయ్ పూర్ లో హిందూ టైలర్ ను హత్య చేయడాన్ని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. ఉదయ్ పూర్ ఘటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.. రాజస్థాన్ ప్రభుత్వం ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సిందన్నారు. ఇలాంటి ఘటన జరిగి ఉండాల్సింది కాదన్నారు.. దేశంలో తీవ్రవాదం విస్తరిస్తోందని అసదుద్దీన్ చెప్పుకొచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేసి వదిలి పెట్టడం సరికాదని అసదుద్దీన్ అన్నారు. ఆమెను కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.