గ్యాస్ సిలెండర్ తీసుకోవాలంటే ఇక ?
వంట గ్యాస్ సిలెండర్ డిపాజిట్ ను ఇందన కంపెనీలు భారీగా పెంచాయి. కనెక్షన్ తీసుకునే వారు ఇకపై 2,200 రూపాయలు చెల్లించాలి
వంట గ్యాస్ సిలెండర్ డిపాజిట్ ను ఇందన కంపెనీలు భారీగా పెంచాయి. గ్యాస్ కనెక్షన్ తీసుకునే వారు ఇకపై 2,200 రూపాయలు చెల్లించాలి. ఇప్పటి వరకూ వంట గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే 1,450 రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. ఇకపై 2,200లు చెల్లించాలి. ఈ మేరకు చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
ధరలను పెంచి....
దీంతో పాటు ఐదు కిలోల సిలెండర్ ధరను ఎనిమిది వందల నుంచి 1,150 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. రెగ్యులేటర్ కావాలంటే ఇకపై రూ. 250లు చెల్లించాల్సి ఉంటుంది. రేపటి నుంచి ఈ ధరలు అమలులోకి రానున్నాయి. చమురు కంపెనీలు గ్యాస్ ధరలు, పెట్రోలు, డీజిల్ ధరలతో పాటు డిపాజిట్ ధరలను కూడా పెంచడంపై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి.