ఆ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ ధర తగ్గిందోచ్
వంట గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్. తాజాగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్
వంట గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్. తాజాగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు ఆయిల్ సంస్థలు తెలిపాయి. ప్రస్తుతం 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ రేట్లను, మూడు మెట్రోపాలిటన్ నగరాల్లో మాత్రమే తగ్గించాయి. తాజాగా 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఒక్కోదానిపై రూ. 5 వరకు తగ్గించింది.
దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను స్వల్పంగా తగ్గించింది కేంద్రం. ఇప్పటి వరకు రూ. 1757 ఉన్న ధరను రూ. 2.50 తగ్గించి రూ. 1755.50కి తగ్గించింది. ముంబైలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లు 1710 నుంచి రూ. 1708.50కి తగ్గాయి. చెన్నైలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ రేట్లు రూ.5 వరకు తగ్గాయి. ఇప్పుడు సిలిండర్ రేటు రూ. 1924కు చేరుకుంది. హైదరాబాద్ లో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర 2002 ఉంది. 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ రేటు ప్రస్తుతం రూ. 955 వద్ద స్థిరంగా ఉంది.
ఢిల్లీలో రూ.1755.50గా ఉన్న 19కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1757కు చేరుకుంది. ముంబైలో కూడా సిలిండర్ ధర రూ.1708కు తగ్గింది. చెన్నైలో ధరలు రూ.4.50 మేర ధర తగ్గింది. ప్రస్తుత ధర రూ.1929గా ఉంది. అయితే, డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎటువంటి మార్పూలేదు.