మంత్రిపై లైంగిక ఆరోపణలు.. పదవికి రాజీనామా
గోవా మంత్రి మిలింద్ నాయక్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన లైంగిక వేదింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్నారు
ఏదైనా వ్యవస్థలో ఎవరికైనా మంచి పేరు, హోదా వస్తుందంటే..ఏదొక రకంగా వారిపై ఆరోపణలు చేసి ఆ పేరును చెడగొట్టేందుకు చుట్టూ ఉన్న చాలామంది కుట్రలు పన్నుతుంటారు. ముఖ్యంగా రాజకీయాల్లో ఇది సర్వసాధారణం. అధికారపక్షంలో ఉన్న నేతలపై ప్రతిపక్షాలవారు ఎప్పుడూ ఏవొక విమర్శలు, ఆరోపణలు చేస్తూనే ఉంటారు. తాజాగా గోవా మంత్రి మిలింద్ నాయక్ పై కూడా అలాంటి ఆరోపణలే వచ్చాయి. ఒక మహిళను మిలింద్ నాయక్ లైంగికంగా వేధించారంటూ కాంగ్రెస్ పార్టీ గోవా అధ్యక్షుడు గిరీష్ చోడంకర్ ఆరోపణలు చేశారు. వెంటనే ఆ మంత్రిని కేబినెట్ నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేయడంతో మిలింద్ తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఒత్తిడి తట్టుకోలేక...
ఒత్తిడి తట్టుకోలేక మిలింద్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు గోవా ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా.. మిలింద్ పై వచ్చిన ఆరోపణలపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మిలింద్ పై వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలన్న ఉద్దేశంతోనే ఆయన రాజీనామా చేసినట్లు సీఎంఓ తెలిపింది. మరి మిలింద్ పై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణల్లో ఎంత నిజముందో తెలియాలంటే.. పోలీసులు విచారణ చేసి, వివరాలు వెల్లడించేంతవరకూ ఆగాల్సిందే.