బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
గత కొద్దిరోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే..! ఈరోజు ధరలు
గత కొద్దిరోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే..! ఈరోజు ధరలు స్థిరంగా ఉన్నాయి. శనివారం (ఆగష్టు 5) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,950 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,950గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధరల్లో ఏ మార్పు లేదు.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,100గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,950గా కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,350లు ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 60,380 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,950గా కొనసాగుతోంది.
వెండి ధరలు వరుసగా మాత్రం మళ్లీ తగ్గాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 74,800లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 200 తగ్గింది. ఈ మూడు రోజుల్లో కిలో వెండి ధర రూ. 3200 తగ్గింది. హైదరాబాద్‌లో వెండి ధర రూ. 78,200లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 78,200ల వద్ద కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 74,800గా ఉండగా.. చెన్నైలో రూ. 78,200గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 74,000 గా నమోదైంది.