కొంచెం ఊరట అనుకోవచ్చుగా
దేశంలో బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి
బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతుంటాయి. తగ్గతే సంబరమే. అలాగే స్థిరంగా కొనసాగినా ఆనందమే. ధరలు పెరగకపోతే చాలు అనే మనస్తత్వానికి చేరుకున్నారు కొనుగోలుదారులు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి బంగారు ఆభరణాలను ఖచ్చితంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ సీజన్‌లో అంత డిమాండ్. దీనికి తోడు అక్షర తృతీయ కూడా తోడు కావడంతో జ్యుయలరీ దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం వంటి కారణాలుగా బంగారం ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వాళ్లు చెప్పినట్లుగానే ధరలు ప్రతిరోజూ పెరుగుతూనే ఉన్నాయి.
స్థిరంగా వెండి...
తాజాగా దేశంలో బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. బంగారం ధరలు స్వల్పంగానే తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,720 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,790 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర 80,400 రూపాయలకు చేరుకుంది.