నిరుద్యోగులూ... త్వరపడండి.. ఇంతకంటే మంచి అవకాశం లేదు
ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇండియన్ నేవీలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలయింది.
ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇండియన్ నేవీలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలయింది. సుమారు 742 పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలయింది. ఇందుకు ఇంటర్మీడియట్ విద్యార్హతగా పేర్కొన్నారు. ఐటీఐ, డిప్లొమా, ఇంటర్ చదవినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ పరీక్షతో ఈ ఉద్యో గాలు భర్తీ చేయనున్నారు. గ్రూప్ బి, గ్రూప్ సి విభాగా ల్లో ఈ పోస్టులున్నాయి. ఈ నేవీ రిక్రూట్ మెంట్ కు ఎంపిక అయిన వారు చార్ట్ మ్యాన్, డ్రాఫ్ట్స్ మెన్, ట్రేడ్ మ్యాన్ మేట్, ఫైర్ మ్యాన్ హోదాతో విధులు నిర్వహించాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
టెక్నికల్ ఉద్యోగాలే....
ఇవన్నీ కూడా టెక్నికల్ ఉద్యోగాలే. అభ్యర్థులకు రాతపరీక్ష, వైద్య పరీక్షలు చేసి, అర్హులకు అవకాశం కల్పించనున్నారు. దేశంలో ఉన్న నేవీ కేంద్రాల్లో వీరంతా విధులు నిర్వహిం చాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 2వ తేదీలోకా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఇండియన్ నేవీ ఈ రిక్రూట్ మెంట్ ద్వారా జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ బి, నాన్ గెజిటెడ్, ఇండస్ట్రి యల్ , నాన్ మినిస్టీరియల్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. సో.. నిరుద్యోగులూ త్వరపడండి.. ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. అర్హులైన వారిని ఎంపిక చేసి దేశంలో వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్ లు ఇవ్వనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.