హిజాబ్ వివాదం.. మూడు రోజులు సెలవులు
నేటి నుంచి మూడు రోజుల పాటు కర్ణాటకలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
నేటి నుంచి మూడు రోజుల పాటు కర్ణాటకలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. హిజాబ్ వివాదం తీవ్రం కావడంతో ముఖ్యమంత్రి బొమ్మై స్వయంగా జోక్యం చేసుకుని సెలవులు ప్రకటించారు. కర్ణాటకలోని ఉడిపిలోని ఒక కళాశాలలలో ప్రారంభమైన హిజాబ్ వివాదం క్రమంగా కర్ణాటక అంతటా పాకుతోంది. విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి కళాశాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
నేడు హైకోర్టులో....
ఒకరిపై ఒకరు రాళ్లు కూడా రువ్వుకున్నారు. కాగా హిజాబ్ వివాదంపై నేడు కర్ణాటక హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదరకుండా మూడు రోజుల పాటు సెలవులను ప్రకటించారు. తిరిగి సోమవారమే కర్ణాటకలో విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి.