పాఠశాలల మూసివేత.. కరోనా ఎఫెక్ట్
మహారాష్ట్రలో పాఠశాలలను బంద్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మహారాష్ట్రలో పాఠశాలలను బంద్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం, పదోతరగతి మినహా అన్ని తరగతులను బంద్ చేశారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తారు. ఈ నెల 31వ తేదీ వరకూ ముంబయిలో పాఠశాలలను మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కేసుల సంఖ్య....
అయితే మహారాష్ట్రలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ఇప్పటికే కొన్ని ఆంక్షలను విధించింది. ఆంక్షలను మరింత కఠినంగా నిర్వహించాలని నిర్ణయించింది. పాజిటివ్ రేటు పెరగుతుండటంతో తొలుత పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది.