పాట్నా హైకోర్టు సంచలన తీర్పు
బీహార్ లో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పాట్నా హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది.
బీహార్ లో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పాట్నా హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. 65 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ పాట్నా హైకోర్టు తీర్పు చెప్పింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను అరవై ఐదు శాతానికి పెంచుతూ బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా కోర్టు తప్పు పట్టుపట్టింది. 65 శాతానికి రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరుద్ధమని పాట్నా హైకోర్టు పేర్కొంది.
65 శాతం రిజర్వేషన్ల పై...
పాట్నా హైకోర్టు తీర్పుపై పిటీషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల కోసమే ఈ రిజర్వేషన్లను పెంచుతూ బీహార్ ప్రభుత్వం తీసుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.