Rain Alert : తమిళనాడులో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్
తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి;

heavy rains in tamil nadu
తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారుల్లో నీరు నిలిచి పోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. తమిళనాడులోని అనేక జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల వారు అలెర్ట్ గా ఉండాలని సూచించింది.
పుదుచ్చేరి లోనూ...
తమిళనాడు డెల్టాప్రాంతంలో ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. చెన్నై, పుదుచ్చేరి సహా ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. పుదుచ్చేరిలో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పుదుచ్చేరిలో ప్రభుత్వాస్పత్రి జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. పేషెంట్లను మరో ఆస్పత్రికి అధికారులు తరలించారు. అధికారులు చెన్నై - పుదుచ్చేరి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తమిళనాడు సేలం జిల్లాలో సబ్‌వేలోకి వరద నీరు వరద నీటిని తొలగించడానికి అధికారుల చర్యలు తీసుకుంటున్నారు.