Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేస్తోంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని కారణంగా ఏపీతో పాటు కేరళ, లక్షద్వీప్, మహే, తమిళనాడు, పుదుచ్చేరి సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఏపీలో భారీ వర్షాలు:
ఈ అల్పపీడనం కారణంగా రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 16 నాటికి వాయుగుండగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలపై అధికంగా ఉంటుందని చెబుతోంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరిక జారీ చేశారు. అలాగే అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో 17, 18 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.