కూల్చివేతలు నిలిపివేయండి..

పంజాబ్-హర్యానా హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టి కూల్చివేతలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Update: 2023-08-07 08:25 GMT

కూల్చివేతలు నిలిపివేయండి.. హైర్యానా సర్కార్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు

హర్యానాలోని నుహ్‌లో కొనసాగుతున్న బుల్‌డోజర్ చర్యలను నిషేధించారు. పంజాబ్-హర్యానా హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టి కూల్చివేతలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. నూహ్‌లో హర్యానా ప్రభుత్వం చేపట్టిన కూల్చివేతపై పంజాబ్‌ అండ్‌ హర్యానా హైకోర్టు సోమవారం స్టే విధించింది. నూహ్‌ హింసాకాండ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కూల్చివేత డ్రైవ్‌ను సుమోటగా స్వీకరించిన సందర్భంగా హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. బాధిత కుటుంబాలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హర్యానా ప్రభుత్వం చేపట్టిన ఈ కూల్చివేత కార్యక్రమాన్ని కూడా కోర్టు తప్పుబట్టింది. పంజాబ్‌, హర్యానా హైకోర్టు ఆదేశాలతో నూహ్‌లో నాలుగు రోజుల తర్వాత కూల్చివేతలు నిలిచిపోయాయి. హర్యానాలోని నూహ్‌ జిల్లాలో సోమవారం జరిగిన అలర్లలకు సంబంధించి ఇప్పటి వరకు 156 మందిని అరెస్టు చేయగా, 56 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఆరుగురు మరణించగా, 80 మందికిపైగా గాయపడ్డారు.

నుహ్‌లో 4 గంటల పాటు కర్ఫ్యూ సడలింపు

హర్యానాలోని హింసాత్మకమైన నుహ్ జిల్లాలో సాధారణ స్థితిని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రజల సౌకర్యాల కోసం కర్ఫ్యూ ఎత్తివేశారు. అంతకుముందు ఆదివారం కూడా కర్ఫ్యూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎత్తివేశారు ఆగస్టు 7 సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు తిరగొచ్చు అంటూ నూహ్ డిప్యూటీ కమిషనర్ ధీరేంద్ర ఖడ్గత ఉత్తర్వులు జారీ చేశారు.

గత సోమవారం నాటి అల్లర్లు, తదనంతర మత హింసలు, బుల్‌డోజర్‌లతో ఆస్తులను ధ్వంసం చేయడం, జూలై 31లో పాల్గొన్న వారిని గుర్తించడంలో సహకరించాలని స్థానికులను కోరడం వంటి సంఘటనల నేపథ్యంలో ఉద్రిక్తంగా ఉన్న నుహ్ డిప్యూటీ కమిషనర్, పోలీసు చీఫ్ జిల్లాలో చర్యలు ముమ్మరం చేశారు. అల్లర్లకు కారణమైన వారిని ఎంతటి వారైనా సరే వదిలి పెట్టేది లేదని పోలీసులు చెబుతున్నారు.

కాగా, నుహ్‌లో జరిగిన హింసాకాండ తర్వాత హర్యానా ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. హింసలో పాల్గొన్న దుర్మార్గుల ఇళ్లు, దుకాణాలు, అక్రమ నిర్మాణాలను బుల్డోజర్‌లో ధ్వంసం చేసింది. ఈ కూల్చివేత అంశం పెద్ద దుమారం రేపింది.

సోమవారం నుహ్ హింసాత్మకంగా ఎనిమిదో రోజుకు చేరింది. డీసీ, ఎస్‌పీలు ప్రధాన మార్కెట్‌కు చేరుకుని ముందుగా మార్కెట్‌లోని ప్రజలతో మాట్లాడి మార్కెట్‌ను మామూలుగా కొనసాగించేందుకు చర్యలు చేపట్టారు. కర్ఫ్యూను సడలిస్తూ ఉదయం 9 గంటల నుంచి ఒంటి గంట వరకు మార్కెట్‌ను తెరవాలని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసినా మార్కెట్‌ ప్రజల్లో భయం నెలకొంది. మళ్లీ ఎప్పుడు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయోనని భయాందోళన చెందుతున్నారు. కర్ఫ్యూ సడలినందున ఎలాంటి హింసా కొనసాగకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యేక భద్రత చర్యలు చేపడుతున్నారు.

Tags:    

Similar News