నేడు కర్ణాటక బంద్

హిజాబ్ వివాదం ఇప్పట్లో సమసి పోయేలా కన్పించడం లేదు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ముస్లిం సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి.

Update: 2022-03-17 02:11 GMT

హిజాబ్ వివాదం ఇప్పట్లో సమసి పోయేలా కన్పించడం లేదు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ముస్లిం సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈరోజు కర్ణాటక బంద్ కు పిలుపు నిచ్చాయి. హిజాబ్ విద్యాసంస్థల్లో తప్పనిసరి కాదని, ఇస్లాంలోనూ దాని ప్రస్తావన ఎక్కడా లేదని హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. నిరసనగా కర్ణాటక బంద్ నకు పిలుపునిచ్చాయి.

ప్రభుత్వం అప్రమత్తం.....
కర్ణాటక బంద్ నకు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అన్ని చోట్ల 144 వ సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఎవరు అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా దక్షిణ కర్ణాటక ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉడిపి జిల్లాల్లో ఈ వివాదం ఎక్కువగా ఉండటంతో అక్కడ మరిన్ని బలగాలను మొహరించారు. మరో వైపు హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హోలీ పండగ తర్వాత దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరిగే అవకాశముంది.


Tags:    

Similar News