హిజాబ్ ముస్లిం మహిళకు గుర్తింపు
కర్ణాటకలో ని హిజాబ్ వివాదం ఇంకా సమసి పోలేదు. దీనిపై ముస్లిం పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
కర్ణాటకలో ని హిజాబ్ వివాదం ఇంకా సమసి పోలేదు. దీనిపై ముస్లిం పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిజాబ్ ముస్లిం మహిళ గుర్తింపు అని, ఇది సమాజంలోని పైశాచిక అంశాల నుంచి రక్షిస్తుందని ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా ఉమ్రైన్ మహాపూజ్ రహ్మాన్ అన్నారు. శతాబ్దాలుగా ఏ సమాజం నగ్నత్వాన్ని ఆలింగనం చేసుకునే దిశగా వెళుతుందో, అది అల్లాహ్ శాపమని, కోపంతో నాశనం చేయబడిందని ఆయన పేర్కొన్నారు.
హిజాబ్ తోనే బయటకు రావాలి.....
హిజాబ్ తోనే బయటకు వెళ్లాలని, ఇస్లాం ఇష్టపడేది అదేనంటూ ఆయన పేర్కొన్నారు. హిజాబ్ ధరించే ముస్లిం మహిళలు దానిపై ప్రచారం చేయాలని కూడా కోరారు. కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా సమసి పోలేదు. న్యాయస్థానంలో ఈ కేసు విచారణ జరుగుతుంది. ఈ సమయంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈ పిలుపు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. హిజాబ్ తోనే బయటకు వెళ్లాలని ఆయన పిలుపునివ్వడం మరింత ఉద్రిక్తతలకు దారి తీస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది.