పాక్ కు సీక్రెట్ సమాచారం లీక్.. భారత డీఆర్డీఓ సైంటిస్ట్ అరెస్ట్

పాక్ ఏజెంట్ తో ఆ శాస్త్రవేత్త వాట్సాప్, వీడియో కాల్స్ తో ప్రతిరోజూ టచ్ లో ఉండేవారని ఏటీఎస్ పేర్కొంది. డీఆర్డీఓలో సీనియర్

Update: 2023-05-05 05:54 GMT

DRDO Scientist Pradeep Kurulkar Arrest

పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ అయిన ఐఎస్ఐ ఏజెంట్ కు భారత్ కు చెందిన కీలక సమాచారాన్ని అందించిన సీనియర్ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ ను ముంబై ఉగ్ర కార్యకలాపాల నిరోధక దళం (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. భారత సమాచారాన్ని ఐఎస్ఐ కు లీక్ చేసిన భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్డీఓకు చెందిన శాస్త్రవేత్తను బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు ముంబై ఏటీఎస్ అధికారులు గురువారం ప్రకటించారు.

ఐఎస్ఐ ఏజెంట్ పన్నిన హనీ ట్రాప్ లో చిక్కి.. భారత్ కు సంబంధించిన సీక్రెట్ సమాచారాన్ని సైంటిస్ట్ లీక్ చేసినట్లు తెలిపారు. పాక్ ఏజెంట్ తో ఆ శాస్త్రవేత్త వాట్సాప్, వీడియో కాల్స్ తో ప్రతిరోజూ టచ్ లో ఉండేవారని ఏటీఎస్ పేర్కొంది. డీఆర్డీఓలో సీనియర్ శాస్త్రవేత్తగా ఉన్న ఆయన తన వద్దనున్న అధికారిక సీక్రెట్ సమాచారాన్ని శత్రువులకు చేరవేయడం దేశభద్రతకు ముప్పు అని తెలిసే ఈ పనికి పాల్పడ్డారని ఏటీఎస్ నిర్థారించింది. అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద శాస్త్రవేత్తపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో మరింత దర్యాప్తు చేసి.. పూర్తివివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించింది.


Tags:    

Similar News