ఫిబ్రవరిలో బ్యాంకులకు సెలవులు
బ్యాంకులు పనిచేయకపోతే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది ఇబ్బందులు పడతారు. ఫిబ్రవరి సెలవుదినాలను ఆర్బీఐ ప్రకటించింది
బ్యాంకులు పనిచేయకపోతే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది ఇబ్బందులు పడతారు. వ్యాపారుల నుంచి సామాన్యుల వరకూ బ్యాంకు లావాదేవీలపై ఆధారపడతారు. ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ప్రతి ఆదివారంతో పాటు ప్రతి రెండు, నాలుగు శనివారాలు కూడా సెలవులే. అంటే నెలకు ఆరు రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. ఇవి అధికారికంగా ప్రకటించడంతో ప్రజలు దానికనుగుణంగా తమ కార్యకలాపాలను చేసుకుంటారు.
తెలుగు రాష్ట్రాల్లో మాత్రం...
ఇక ప్రతి నెల పండగ, పబ్బం రూపంలో సెలవులు వస్తుంటాయి. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పండగలకు ప్రత్యేకం. అక్కడ సెలవులను ప్రత్యేకంగ ప్రకటిస్తుంటారు. ఫిబ్రవరి నెలలో 28 రోజులే ఉంటాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కేవలం ఆరు రోజులే సెలవులు ఉండనున్నాయి. గ్యాంగ్‌టక్, అగర్తాలా, ఇంపాలా, ఛండీఘర్, కోల్‌కత్తా వంటి చోట మాత్రం పన్నెండు రోజులు సెలవులు వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాలెండర్ ను బట్టి తెలుస్తోంది.