విడాకులను వేడుకగా చేసుకున్న మహిళ..ఇన్ స్టా లో ఫొటోలు వైరల్

ఓ విషాదకర వివాహ బంధాన్ని విడిచి పెట్టేందుకు విచారించక్కర్లేదు. ఎందుకంటే, సంతోషంగా ఉండడానికి మీరు..

Update: 2023-05-02 12:53 GMT

divorce photo shoot

వివాహం అనే బంధంతో ఒక్కటైన దంపతులు కలిసి ఉండలేని పక్షంలో.. పరస్పర అంగీకారంతో వెంటనే విడాకులు పొందవచ్చని, అందుకు 6 నెలల వేచి ఉండాల్సిన అవసరం లేదని నిన్న సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ మహిళ.. తనకు విడాకులు మంజూరు కావడంతో.. దానిని పెళ్లిలా ఓ వేడుకగా చేసుకుంటూ ఫోటోలు దిగి నెట్టింట పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ పై కొందరు పాజిటివ్ గా మరికొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు. ఆమె ప్రొఫైల్ ను బట్టి చూస్తే చిన్న పాప కూడా ఉన్నట్లు తెలుస్తోంది. విడాకులు తీసుకున్న మహిళలందరికీ తాను పెట్టే ఈ పోస్ట్, మెసేజ్ లు అంకితమని తెలిపింది.

‘‘ఓ విషాదకర వివాహ బంధాన్ని విడిచి పెట్టేందుకు విచారించక్కర్లేదు. ఎందుకంటే, సంతోషంగా ఉండడానికి మీరు అర్హులు. మీ జీవితంపై నియంత్రణను మీ చేతుల్లోకి తీసుకోండి. మీకు, మీ పిల్లల మెరుగైన భవిష్యత్తుకు కావాల్సిన మార్పులు తీసుకురండి. విడాకులు వైఫల్యం కానే కాదు! మీ జీవితాన్ని మలుపు తిప్పేది. మీ జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చేది. వైవాహిక బంధాన్ని వదిలిపెట్టి ఒంటరిగా ప్రయాణించేందుకు ఎంతో సాహసం కావాలి. ధైర్యవంతులైన మహిళలందరికీ నేను దీన్ని అంకితం చేస్తున్నాను’’ అంటూ పెళ్లయ్యి ఒంటరి జీవితాన్ని ఎంపిక చేసుకున్న షాలిని అనే మహిళ ఇన్ స్టా లో పేర్కొంది.
విడాకులను కూడా వేడుకలా జరుపుకుని ఫోటో షూట్ నిర్వహించింది. తనకు 99 సమస్యలు ఉన్నాయంటూ, వాటిలో భర్త ఒక సమస్య కాకూడదంటూ కొటేషన్ తో కూడిన ఫొటో పెట్టింది. ఎర్రటి డ్రెస్ ధరించి, డైవర్స్ డ్ అనే లెటర్స్ ను పట్టుకుని దిగిన ఫొటోను షేర్ చేసింది. తన పెళ్లి సమయంలో భర్తతో దిగిన ఫొటోని మధ్యకు చింపేస్తూ మరో ఫొటోని షేర్ చేసింది. భర్త ఫొటోని కాలి కింద వేసి తొక్కి తనలో తానే ఆనందాన్ని అనుభవించింది. మొత్తానికి వైవాహిక బంధాన్ని తెంపుకోవాల్సి వస్తే, విచారించడం వల్ల లాభం లేదని.. ఏం జరిగినా సంతోషంగా స్వీకరించండి అంటూ సందేశాన్నిచ్చింది.


Tags:    

Similar News