రెండువేల నోట్లన్నీ ఇక్కడే ఉన్నాయ్
పశ్చిమ బెంగాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు జరిపిన దాడుల్లో రెండువేల రూపాయల నోట్ల కట్టలు గుట్టలుగా బయటపడ్డాయి.
పశ్చిమ బెంగాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు జరిపిన దాడుల్లో రెండు వేల రూపాయల నోట్ల కట్టలు గుట్టలుగా బయటపడ్డాయి. ఆ రాష్ట్రానికి చెందిన మంత్రి సన్నిహితుల ఇంట్లో ఈ కట్టలు దొరికాయి. పశ్చిమ బెంగాల్ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పార్థా ఛటర్జీకి అత్యంత సన్నిహితురాలు అయిన అర్పిత ముఖర్జీ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో రెండు వేల రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఇవి 20 కోట్ల రూపాయల వరకూ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అధికారులు కట్టలు లెక్క వేయాడానికి మిషన్లు ఉపయోగించాల్సి వచ్చింది.
ఎస్ఎస్‌సీ నియామకాల్లో....
బెంగాల్ లో జరిగిన స్కూల్ సర్వీస్ నియామకాల్లో జరిగిన అవకతవకలు సంబంధించి ఈ నగదును దాచినట్లుగా ఈడీ అధికారులు నిర్ధారణకకు వచ్చారు. ఎక్కువగా రెండు వేల నోట్లు, కొన్ని 500 రూపాయల నోట్లు ఉన్నాయి. ఈడీ సోదాల్లో ఇరవైకి పైగా మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై అర్పిత ముఖర్జీని ఈడీ అధికారులు విచారించనున్నారు.