జనవరి 26 వరకూ కళాశాలలు బంద్
హిమాచల్ ప్రదేశ్ లో ఈ నెల 26వ తేదీ వరకూ కళాశాలలు, పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ లో విజృంభిస్తుంది. రోజుకు లక్షన్నర కేసులు నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్ తో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగానే నమోదవుతున్నాయి. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. ఇక హిమాచల్ ప్రదేశ్ లో ఈ నెల 26వ తేదీ వరకూ కళాశాలలు, పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 26వ వరకూ ఎవరూ తెరవవద్దని ఆదేశించింది.
ఆ కళాశాలలు తప్ప....
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ఈ మేరకు అధికారులను ఆదేవించారు. కరోనా పరీక్షల సంఖ్యను రాష్ట్రంలో పెంచాలని ఆదేశించారు. కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు. మెడికల్, డెంటల్, నర్సింగ్ కళశాలలు మినహా అన్ని కళాశాలలను మూసివేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నెల 26 వతేదీ వరకూ ఎలాంటి కళాశాలలు తెరవడానికి వీలులేదని ప్రభుత్వం ఆదేశించింది.