బలపరీక్షలో నెగ్గిన హేమంత్ సర్కార్

జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. బలపరీక్షలో సోరెన్ కు మద్దతుగా 48 ఓట్లు వచ్చాయి.

Update: 2022-09-05 08:19 GMT

జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. కొద్దిసేపటి క్రితం జరిగిన బలపరీక్షలో సోరెన్ కు మద్దతుగా 48 ఓట్లు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ బలపరీక్షను బాయ్ కాట్ చేసింది. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. జార్ఖండ్ లో హేమంత్ సోరెస్ ప్రభుత్వం తనంతట తానే బలపరీక్షకు సిద్దమయింది.

ిబీజేపీ వాకౌట్....
ఇటీవల హేమంత్ సోరెన్ శాసనసభ్యత్వం రద్దవుతుందని ప్రచారం జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సిఫార్సు మేరకు సోరెన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశముందని వార్తలు వచ్చాయి. తనంతట తానుగా మైనింగ్ గనులు కేటాయించడాన్ని తప్పు పడుతూ ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. కానీ గవర్నర్ ఇంకా సోరెన్ శాసనసభ్యత్వంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈలోపు తన ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని భావించిన హేమంత్ సోరెన్ బలపరీక్ష కు దిగారు. తాను బలపరీక్షలో గెలవడంతో మరో ఆరు నెలలు ప్రభుత్వానికి ఇబ్బంది ఉండే అవకాశాలు లేవు.


Tags:    

Similar News