Tamilnadu : 34కు చేరిన కల్తీ సారా మృతుల సంఖ్య

తమిళనాడులోని కాళ్లకురిచిలో కల్తీ సారా మృతుల సంఖ్య 34కు చేరింది

Update: 2024-06-20 03:53 GMT

తమిళనాడులోని కాళ్లకురిచిలో నాటు సారా మృతుల సంఖ్య 34కు చేరింది. కల్తీ సారా తాగి మృతి చెందిన ఘటనపై తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయింది. దాదాపు అరవై మంది కల్తీసారా తాగి అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇరవై మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వీరికి మెరుగైన చికిత్సను అందించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారులను ఆదేశించారు. కల్తీసారా తయారీ చేసిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గోవిందరాజులు అనే వ్యక్తి ఇందులో కీలకమని భావిస్తున్నారు.

ఈ ఘటనలో...
కల్తీసారా ఘటనలో ఇప్పటి వరకూ తొమ్మిది మంది అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింద.ి కాళ్లకురిచి కలెక్టర్ శ్రావణ్ కుమార్ ను బదిలీ చేశఆరు. జిల్లా ఎస్పీ మీనాను సస్పెండ్ చేశారు. కల్తీ సారాను తయారు చేసి దానిని తక్కువ ధరకు విక్రయించడంతోనే ఎక్కువ మంది తాగారని అందుకే ఈ స్థాయిలో అస్వస్థతకు గురయ్యారని, ఎక్కువ స్థాయిలో మరణించారని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనకు బాధ్యులయిన వారిని ఎవరినీ వదిలిపెట్టబోమని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు.


Tags:    

Similar News