ముర్ముకు పాదాభివందనం.. ఇంజినీర్ సస్పెన్సన్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పాదాభివందనం చేయబోయిన ఒక ఇంజినీర్ ను సస్పెండ్ చేసిన ఘటన రాజస్థాన్ లో జరిగింది.

Update: 2023-01-15 04:21 GMT

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పాదాభివందనం చేయబోయిన ఒక ఇంజినీర్ ను సస్పెండ్ చేసిన ఘటన రాజస్థాన్ లో జరిగింది. ప్రొటోకాల్ ను అతిక్రమించి ఇంజినీర్ రాష్ట్రపతి పాదాలను తాకేందుకు ప్రయత్నించారని ఆమెపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నెల 3,4 తేదీల్లో రాజస్థాన్ లో ఈ ఘటన జరిగింది. రోహెత్ లోని స్కౌట్ అండ్ గైడ్స్ లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చారు.

జూనియర్ ఇంజినీర్...
అక్కడ ముర్ము నడుచుకుంటూ వస్తుండగా రాష్ట్రపతి ముర్ము పాదాలను తాకేందుకు జూనియర్ ఇజినీర్ అంబా సియోల్ ప్రయత్నించారు. అయితే అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. ఇది భద్రతా వైఫల్యంగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతో ఇంజినీర్ అంబా సియోల్ ను సస్పెండ్ చేశారు. పాదాలకు నమస్కరిస్తే సస్పెండ్ చేస్తారా? అంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.


Tags:    

Similar News