ఐటీ దాడులు.. సంచుల్లో కుక్కిన 26 కోట్ల నగదు స్వాధీనం

మహారాష్ట్ర నాసిక్‌లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.

Update: 2024-05-26 12:28 GMT

మహారాష్ట్ర నాసిక్‌లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. బంగారు దుకాణాల్లో పెద్దయెత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. లెక్కలు చూపని నగదును సంచుల్లో ఉంచిన 26 కోట్ల రూపాయలను ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాసిక్ లోని ఒక నగల దుకాణం, ఆ యజమాని కార్యాలయంపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

బంగారు దుకాణాల్లో...
సంచుల్లో 26 కోట్ల రూపాయలు సర్ది ఆదాయపు పన్ను శాఖ కన్ను గప్పేందుకు ప్రయత్నించారు. 90 కోట్ల రూపాయల ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 30 గంటల పాటు ఈడీ అధికారులు కూడా సోదాలు నిర్వహించారు. మొత్తం 116 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశారు. ఇదంతా లెక్కల్లో చూపని నగదేనని ఐటీ అధికారులు తెలిపారు.


Tags:    

Similar News