ఏసీ బోగీల జోరు...సామాన్య ప్రయాణీకులు బేజారు!

రైల్వే ప్రయాణం ఇదివరలో సామాన్యులకు అందుబాటులో ఉండేది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లతోపాటు , సాధారణ రైళ్లలో కూడా స్లీపర్ కోచ్ లు ఎక్కువగా ఉండేవి

Update: 2023-08-20 10:50 GMT

ఏసీ బోగీల జోరు...సామాన్య ప్రయాణీకులు బేజారు

రైల్వే ప్రయాణం ఇదివరలో సామాన్యులకు అందుబాటులో ఉండేది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లతోపాటు , సాధారణ రైళ్లలో కూడా స్లీపర్ కోచ్ లు ఎక్కువగా ఉండేవి. అయితే ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. అన్నిరూట్లలోనూ సాధారణ రైళ్లు తగ్గించారు. అందునా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే 38 సాధారణ రైళ్లను రైల్వేశాఖ కేన్సిల్ చేసింది. వందే మాతరం రైళ్లను వివిధ మార్గాల్లో నడుపుతూ సామాన్య ప్రజలకు రైల్వే ప్రయాణాన్ని దూరం చేస్తోంది. ప్రస్తుతం దూర ప్రాంతాల మధ్య తిరిగే మెయిల్, ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లల్లో ఎయిర్ కండిషన్డ్ బోగీలను రెట్టింపు చేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా థర్డ్ ఏసీ బోగీలు ప్రతి రైలులో పెరగనున్నాయి. ప్రస్తుతం తూర్పు రైల్వే పరిధిలోని అన్ని రైళ్లల్లో వీటిని పెంచుతున్నారు. వీటికి ఆదరణ ఎలా ఉంది అనే విషయాన్ని కొద్దికాలం పరిశీలించిన తర్వాత జోన్లవారీగా అన్ని రైళ్లల్లో పెంచాలని అధికారులు నిర్ణయించారు.

పాట్నా జంక్షన్, కోల్‌కతా-ఆగ్రా కాంటినెంటల్, కోల్‌కతా-షిల్‌ఘాట్ ఎక్స్‌ప్రెస్ మీదుగా రెండు AC 3-టైర్ ఎకానమీ కోచ్లు, కోల్‌కతా-గాజీపూర్ సిటీ వీక్లీ ఎక్స్‌ప్రెస్ కు AC 3-టైర్ ఎకానమీ కోచ్ యాడ్ చేశారు. మాల్దా-ఢిల్లీ ఫరక్కా ఎక్స్‌ప్రెస్, మాల్దా-ఫరక్కా ఎక్స్‌ప్రెస్ వయా ఫైజాబాద్ రైళ్లలో కూడా ఏసీ కోచ్‌లు పెరుగుతున్నాయి.

దక్షిణమధ్య రైల్వే పరిధిలో కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లకు కూడా థర్డ్ ఏసీ బోగీలు పెంచారు. కానీ వీటిపెంపుపై రైల్వే తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. బోగీల సంఖ్య పెంచారన్న పేరే కాని, స్లీపర్ లో రూ.300 అయ్యే టికెట్లు రూ.700 అవుతోందని, ఇది ఒకరకంగా ప్రయాణికులను దోచుకోవడమేనంటూ రైల్వే యూజర్స్ అసోసియేషన్ నాయకులు మండిపడుతున్నారు. క్రమానుగతంగా ఒక్కో మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లల్లో స్లీపర్ బోగీలను తగ్గించుకుంటూ థర్డ్ ఏసీ బోగీల సంఖ్య పెంచుకుంటూ వస్తున్నారన్నారు., స్లీపర్ బోగీల్లో కనీసం టీటీఈలు కూడా తనిఖీలకు రావడంలేదని, స్లీపర్, జనరల్ బోగీల్లో ప్రయాణించేవారంటే రైల్వేకు లెక్కలేదంటూ రైల్వే ప్రయాణీకులు ధ్వజమెత్తారు.

Tags:    

Similar News