ఇండియా కోవిడ్ అప్డేట్.. పెరుగుతున్న యాక్టివ్ కేసులు
గత 24 గంటల్లో 3,079 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 20,635 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. వారంతా హోంక్వారంటైన్లు..
న్యూ ఢిల్లీ : భారత్ లో రోజువారీ కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఫలితంగా దేశంలో రికవరీల కంటే.. యాక్టివ్ కేసుల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. గడిచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసులు, మరణాల వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో గత 24 గంటల్లో 3,451 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు తెలిపింది. ఇదే సమయంలో కరోనా కారణంగా 40 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.
గత 24 గంటల్లో 3,079 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 20,635 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. వారంతా హోంక్వారంటైన్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,25,57,495గా ఉండగా.. కరోనా మృతుల సంఖ్య 5,24,064కి పెరిగిందని వివరించింది.
ఇక మొత్తం కేసుల్లో 0.05 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 98.7 శాతం మంది కోలుకోగా, 1.22 శాతం మంది కరోనాకు బలయ్యారని తెలిపింది. దేశవ్యాప్తంగా 1,90,20,07,487 కరోనా డోసులను పంపిణీ చేశామని, శనివారం ఒకేరోజు 17,39,403 మందికి వ్యాక్సినేషన్ చేశామని పేర్కొంది.