Weather Report : శుభవార్త.. గతం కంటే ఈసారి కుండపోత వర్షాలట

దేశంలో ఈసారి సాధారణ వర్షపాతం కంటే అధికంగా నమోదవుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది

Update: 2024-05-28 02:35 GMT

దేశంలో ఈసారి సాధారణ వర్షపాతం కంటే అధికంగా నమోదవుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో అధిక వర్షాలు ఈ ఏడాది కురిసే అవకాశముందని చెప్పింది. రాబోయే నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ లో ప్రవేశించనున్నాయని చెప్పింది. ఈ నెల 31వ తేదీ నాటికి కేరళను రుతుపవనాలు తాకే అవకాశముందని తెలిపింది.

ఉష్ణోగ్రతలు కూడా...
ఈ ఏడాది గతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని కూడా తెలపడంతో మంచి వార్తగానే చూడాలని అంటున్నారు. దీనివల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. నదులు నిండి పుష్కలంగా సాగు, తాగు నీరు అందుబాటులో ఉండనుంది. అయితే పశ్చిమ వాయవ్య ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండటంతో పగటి పూట ఉష్ణోగ్రతలు రాబోయే రెండు రోజులు పెరుగుతాయని తెలిపింది.


Tags:    

Similar News