డేంజరస్ ఆపరేషన్ చేసి కాపాడిన భారత నేవీ కమాండోలు..!

హిందూ మహా సముద్రంలో లైబీరియా జెండా కలిగి ఉన్న ఓ నౌక గురువారం;

Update: 2024-01-05 15:41 GMT
IndianNavy, Navy, CargoShip

Indian Navy says hijacking foiled after rescuing crew including Indians

  • whatsapp icon

హిందూ మహా సముద్రంలో లైబీరియా జెండా కలిగి ఉన్న ఓ నౌక గురువారం సాయంత్రం హైజాక్‌ కు గురైంది. ఈ విషయం తెలుసుకున్న భారత నావికాదళం ఐఎన్‌ఎస్‌ చెన్నై యుద్ధ నౌకను రంగం లోకి దింపింది. హెలికాప్టర్‌ ద్వారా హైజాకర్లకు హెచ్చరికలు జారీ చేశామని.. బందీలను విడిపించేందుకు నేవీ కమాండోలు హైజాక్‌ కు గురైన నౌక లోకి ప్రవేశించారు. కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం నౌక లోని 15 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సముద్రపు దొంగలు హైజాక్‌ చేసిన కార్గో షిప్‌ పైకి ఇండియన్‌ నేవీ మెరైన్‌ కమాండోలు చేరుకున్నారు. ఆ ఓడను వీడి వెళ్లాలని సముద్రపు దొంగలను హెచ్చరించారు. భారతీయ సిబ్బందిని రక్షించారు. లైబీరియాకు చెందిన కార్గో షిప్ ‘ఎంవీ లీలా నార్ఫోక్’ను సోమాలియా తీరం సమీపంలో సముద్రపు దొంగలు హైజాక్‌ చేశారు. అందులో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ చెన్నై స్పందించింది. హైజాక్‌ అయిన కార్గో షిప్‌ను అనుసరించి సొమాలియా తీరానికి చేరింది. ఆ వెంటనే మెరైన్‌ కమాండోలు రంగంలోకి దిగారు. హైజాక్‌ చేసిన ఆ ఓడను విడిచి వెళ్లాలని హెలికాప్టర్‌ ద్వారా సముద్ర దొంగలను హెచ్చరించారు. అనంతరం కార్గో షిప్ ‘ఎంవీ లీలా నార్ఫోక్’ పైకి మెరైన్‌ కమాండోలు దిగారు. 15 మంది భారతీయ సిబ్బందితోపాటు మిగతా వారిని సముద్ర దొంగల బారి కాపాడినట్లు ఇండియన్‌ నేవీ తెలిపింది.


Tags:    

Similar News