Breaking : గాలిలో ఉండగానే... వడగళ్ల వాన... ఇండిగో విమానం
ఇండిగో విమానానికి ముప్పు తప్పింది. అహ్మాదాబాద్ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది;
ఇండిగో విమానానికి ముప్పు తప్పింది. అహ్మాదాబాద్ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాలిలో విమానం ఉండగానే ముందు భాగం దెబ్బతినింది. వడగళ్ల వానకు విమానం ముందు భాగం దెబ్బతినడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
సేఫ్ గా ల్యాండింగ్...
అయితే హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానం సేఫ్ గా లాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వడగళ్ల వానకు ముందు భాగం దెబ్బతినిందని, అయినా పైలట్ చాకచక్యంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేఫ్ గా ల్యాండ్ చేయగలిగారని ప్రయాణికులు మెచ్చుకుంటున్నారు.