Supreme Court : కోల్‌కత్తా ఘటనపై సీరియస్ అయిన సుప్రీంకోర్టు

కోల్‌కతాలోని వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

Update: 2024-08-20 06:48 GMT

vote for note

కోల్‌కతాలోని వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నలు మీద వ్రశ్నలు వేసింది. విధ్వంకారుల గుంపు ఆసుపత్రిలోకి ఎలా వెళ్లిందని ప్రశ్నించింది. సాక్ష్యాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నా పోలీసులు ఏం చేస్తున్నారని సుప్రీంకోర్టు నిలదీసింది. దీంతో పాటు కీలక ఆదేశాలు జారీ చేసింది. గురువారం లోగా దర్యాప్తుపై అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది.

కీలక ఆదేశాలు...
జాతీయ స్థాయిలో నేషనల్ టాస్క్‌ఫోర్స్ ను ఏ్పాటు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష‌్టమైన ఆదేశాలు జారీ చేసింది. దుండగులను కట్టడి చేయడంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విఫలమయిందని అభిప్రాయపడింది. నేషనల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటుచేయాలని ఇందులో హైదరాబాద్ కు చెందిన ఏషియన్ నేషనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డికి చోటు కల్పించాలని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.


Tags:    

Similar News