చెంగాళమ్మను దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్

ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ తల్లిని శుక్రవారం దర్శించి, ఆదిత్య ఎల్ 1 విజయం కోసం ప్రత్యేక పూజలు చేశారు.

Update: 2023-09-01 13:28 GMT

చెంగాళమ్మను దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్

ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ తల్లిని శుక్రవారం దర్శించి, ఆదిత్య ఎల్ 1 విజయం కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఈ రోజు ఉదయం 7.30 గంటలకు ఆయన ఆలయానికి చేరుకున్నారని పూజారులు తెలిపారు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన సమయంలోనే ఆయన పూజలకోసం వెళ్లారు. రేపు (శనివారం) 11.50లకు అంతరిక్షంలోకి ప్రయోగిస్తామన్నారు. 125 రోజుల అనంతరం అది నిర్థేశిత ప్రాంతానికి చేరుకొని పరిశోధనలు చేపడుతుందన్నారు.

స్వామివారి సేవలో ఇస్రో సైంటిస్టులు




సూర్యుడిపై ప్రయోగాలకు సన్నద్ధమైన ఇస్రో ఆదిత్య ఎల్ 1 ప్రాజెక్ట్‌ను చేపట్టింది. సెప్టెంబర్ 2న అంటే శనివారం ఉదయం 11:50 నిమిషాలకు ఆదిత్య ఎల్ 1 శాటిలైట్ సూర్యుడి వైపు దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. దీన్ని మోసుకెళ్లడానికి పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్‌ను వినియోగించనుంది ఇస్రో. ప్రయోగించిన రోజు నుంచి ఈ శాటిలైట్ సూర్యుడి దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. 110 నుంచి 120 రోజుల తరువాత ఎల్1కు చేరుకుంటుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఇస్రో తెలిపింది.

ఈ నేపథ్యంలో- ఇస్రో శాస్త్రవేత్తలు శుక్రవారం ఉదయం తిరుమలకు చేరుకొని శ్రీవేంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. ఆదిత్య ఎల్1 మిషన్ విజయవంతం కావాలని ప్రార్థించారు. దాదాపుగా కౌంట్ డౌన్ ఆరంభమైన సమయంలోనే వారు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలకు వచ్చిన ఇస్రో శాస్త్రవేత్తలను తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం ప్రధాన ఆలయం వెలుపల గల రంగనాయకుల మండపంలో వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వేదాశీర్వచనాలను పలికి, శేషవస్త్రాలను బహూకరించారు.

Tags:    

Similar News