చంద్రయాన్-3 ల్యాండింగ్ డేట్ మారొచ్చట
ISRO చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ లో భాగంగా.. విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23న
ISRO చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ లో భాగంగా.. విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23న చంద్రుని ఉపరితలంపై దిగేందుకు సిద్ధంగా ఉంది. చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ చేయడానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఒకవేళ ల్యాండింగ్ కు సరైన అవకాశం లేకపోతే.. చంద్రయాన్-3 ల్యాండింగ్ ఆగస్ట్ 27కి ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్‌కు ఏదైనా ప్రతికూల పరిస్థితి కనిపిస్తే సాఫ్ట్ ల్యాండింగ్‌ను ఆగస్టు 27కు వాయిదా వేస్తామని అహ్మదాబాద్‌లోని ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ ప్రకటించింది. ల్యాండర్ మాడ్యూల్ పనితీరు, చంద్రుడి ఉపరితలంపై పరిస్థితులపై ల్యాండింగ్ నిర్ణయం ఆధారపడి ఉంటుందని డైరెక్టర్ నీలేష్ ఎం దేశాయ్ తెలిపారు. ఆగస్టు 23న చందమామపై చంద్రయాన్-3 ల్యాండింగ్‌కు నిర్దేశించిన సమాయానికి 2 గంటల ముందు పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని నీలేష్ స్పష్టం చేశారు. ఒక వేళ ఏదైనా పరిస్థితి ప్రతికూలంగా ఉందని భావిస్తే ల్యాండింగ్ ఆగస్టు 27కు వాయిదాపడుతుందన్నారు.